తీరనున్న ట్రాన్స్‌‘ఫార్మర్‌’ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

తీరనున్న ట్రాన్స్‌‘ఫార్మర్‌’ తిప్పలు

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

పెద్దపల్లిరూరల్‌: వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే అన్నదాతలకు ఎంత కష్టమో.. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను రిపేర్‌ సెంటర్‌కు తరలించేందుకు పడే బాధలు అన్నీఇన్నీకాదు. ఈ సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు అధికా రులకు కేవలం సమాచారం అందిస్తే చాలు ట్రాన్స్‌కో వాహనం సత్వరమే ఘటనా స్థలానికి ఆగమేఘాలపై చేరుకుంది. దానిని వెనువెంటనే రిపేర్‌ సెంటర్‌కు తీసుకెళ్తుంది. అక్కడ మరమ్మతులు పూర్తయ్యాక మళ్లీ యథాస్థానంలో ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం విద్యుత్‌ అధికారులు, సిబ్బందే యుద్ధప్రాతిపదికన పనిచేస్తారు.

జిల్లాలో 9 వాహనాలు

జిల్లాలోని సబ్‌ డివిజన్‌, డివిజన్‌ పరిధిలో ఎక్కడ కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలి. వారు సత్వరమే స్పందించి సమీపంలో అందుబాటులో ఉన్న వాహనం ఘటనా స్థలానికి చేరుకునేలా ఆదేశాలు జారీచేస్తారు. అంతేకాదు.. కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను రిపేర్‌ సెంటర్‌కు చేర్చుతారు. ఇందుకోసం జిల్లాలో జీపీఎస్‌ ట్రాకింగ్‌తో కూడిన 9 వా హనాలను అందుబాటులో ఉంచారు. అక్కడి పరిస్థితులను బట్టి రిపేర్‌ చేయడమా? లేక వేరొకదానిని అమర్చడమా? అనేది నిర్ణయించి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.

మెరుగైన సేవల కోసం..

వ్యవసాయ రంగానికి మెరుగైన సేలు అంలందించాలనే లక్ష్యంతోనే ట్రాన్స్‌కో అధికారులు ఈ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పంట లు దెబ్బతినకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చే యాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు కోసం ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుతున్నారు.

సమస్యపై సమాచారం ఇస్తే చాలు..

విద్యుత్‌ సంబంధ సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారమందించాలని సూచిస్తున్నా రు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్వయంగా కరెంట్‌ ట్రాన్స్‌ఫర్మర్లు, విద్యుత్‌ పరికరాలను తాకరాదని వారు పేర్కొంటున్నారు. స్థానిక అధికారులకో టోల్‌ఫ్రీ నంబరు 1912కు ఫిర్యాదు చేసినా స్పందిస్తారని వివరించారు.

ట్రాన్స్‌ఫార్మర్లను మోసే ‘భారం’ మాదే

కాలిపోయినట్లు సమాచారం ఇస్తే చాలు

మోసుకొచ్చేందుకు 9 వాహనాలు సిద్ధం

రైతులకు సత్వర సేవలు అందించడమే మా లక్ష్యం

పెద్దపల్లి ట్రాన్స్‌కో సర్కిల్‌ ఎస్‌ఈ గంగాధర్‌

Advertisement
 
Advertisement
Advertisement