పెద్దపల్లి: మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం మహిళలకు రుణాలు అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ఆర్థికంగా ఎదురగుతున్నారు. ఈక్రమంలోనే రుణాల పంపిణీ, రికవరీలో జిల్లా తెలంగాణకే ఆదర్శంగా నిలిచింది. సీ్త్రనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా మెప్మా పరిధిలో అందించిన సేవలకు గుర్తింపుగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకుంది. 96శాతం రికవరీ రేటు, రూ.22.19 కోట్ల రుణ పంపిణీతో జిల్లా యంత్రాంగం చరిత్ర సష్టించింది.
రాష్ట్రంలో అగ్రస్థానం
జిల్లా సాధించిన విజయం కేవలం సంఖ్యల వరకే కాదు.. మహిళల నమ్మకం, అధికారుల కృషి కలగలిపిన ఫలితం. 96శాతం రికవరీ రేటు రాష్ట్రంలోనే అత్యధికం. మహిళా సంఘాల సభ్యులు క్రమశిక్షణతో సకాలంలో వాయిదాలు చెల్లించడమే ఇందుకు కారణం. జిల్లాలోని మహిళల ఆర్థిక పురోభివద్ధి కోసం రికార్డుస్థాయిలో రూ.22.19 కోట్ల రుణాలు మంజూరు చేశారు. చిన్న వ్యాపారాలు, గృహ, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఇవి ఊతమిచ్చాయి. ఈ ఘనతకు గుర్తింపుగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, అరుణశ్రీ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. 2025–26 జిల్లాలో డిమాండ్ రూ.18 కోట్ల 43 లక్షల రూ.22 కోట్ల 19 లక్షలు(120) శాతం పంపిణీ చేసినట్లు ఆర్‌ఎం దుర్గాప్రసాద్ తెలిపారు. రికవరీ చేయాల్సింది రూ.15 కోట్ల 25 లక్షలకు రూ.14 కోట్ల 53 లక్షలు రికవరీ చేశారు. జిల్లాలో ఎస్‌ఎస్‌జీలు 4,644 ఉండగా 44,172 మంది సభ్యులు ఉన్నారు.
మహిళలకు ఆర్థిక ఊతం
సీ్త్రనిధి ద్వారా అందించే రుణాలు మహిళలకు ఊరటనిస్తున్నాయి. కేవలం 92 పైసల వడ్డీకే(సంవత్సరానికి 11.04శాతం) రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇది బ్యాంకుల వడ్డీరేట్ల కన్నా చాలాతక్కువ. చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారాలు చేసే మహిళలకు ఈ తక్కువ వడ్డీరేటు ఎంతో ప్రయోజనకరంగా మారింది.
డిజిటల్ విప్లవంతో పారదర్శకత
రుణాల పంపిణీ, వసూళ్లలో పారదర్శకత సాధించడానికి జిల్లా యంత్రాంగం శ్రీమన సీ్త్రనిధిశ్రీ యాప్‌ను విరివిగా ప్రోత్సహిస్తోంది. ప్రతీసభ్యురాలు తన వ్యక్తిగత రుణ వివరాలు, వాయిదాలు, బ్యాలెన్స్‌ను నేరుగా యాప్‌లో చూసుకోవచ్చు. తద్వారా ఎవరూ మోసపోయే అవకాశం లేదు. స్వయం సహాయక సంఘం ఆర్థిక స్థితిగతులు, గ్రూపు లెడ్జర్ వివరాలు పారదర్శకంగా తెలుస్తాయి.
అధికారుల కృషి, మహిళల క్రమశిక్షణ
అధికారుల చొరవ, మహిళల క్రమశిక్షణ అవార్డు సాధించడానికి దోహదం చేశాయి. అదనపు కలెక్టర్ అరుణశ్రీ నేతత్వంలోని మెప్మా సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ల సహకారం కీలకమైంది. ‘మన సీ్త్రనిధి’ యాప్‌పై అవగాహన కల్పించడంతో మహిళలు డిజిటల్ పద్ధతిని అలవర్చుకున్నారు. సీ్త్రనిధి బ్యాంకు సిబ్బంది సహకారం రుణాల పంపిణీ, వసూళ్లలో వేగం పెంచింది.
ఇది కొత్త అధ్యాయం
జిల్లా సాధించిన విజయం కేవలం అవార్డు కాదు.. మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం. రుణాలు పొందిన మహిళలు స్వయం ఉపాధి పొంది, కు టుంబ ఆదాయాలు పెంచుకున్నారు. ఆర్థిక స్వావలంబన సాధించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవం పెరిగాయి. భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తితో మహిళా సంక్షేమంలో ముందంజలో ఉంటామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది.


