పెద్దపల్లి: అభాగ్యుల సమస్యలు వింటూ అక్కడిక క్కడే పరిష్కరించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్ర త్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. పాలకవర్గం తీర్మానం ప్రకారం మట్టి తీయొ ద్దని పెద్దపల్లి మండలం తురకలమద్దికుంట సర్పంచ్ రాజయ్య కోరారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంట నష్టంపై వ్యవసాయాధికారులు సర్వే చేయా లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో ఆర్డినేటర్ ఆ కుల స్వామి వివేక్ పటేల్ విన్నవించారు. కన్నాలలో ఫ్లై ఓవర్ ఒకవైపు ఉంటే మరోవైపు రోడ్డు నిర్మిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి రాజీవ్‌నగర్‌లోని ఆర్.రాధ.. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరింది. అంతర్గాం మండలం విస్సంపేటకు చెందిన పి.కిట్టయ్య.. తాము బర్రెలు కాసుకుంటూ బతుకుతున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించాడు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్.. వాటిని పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న సుమారు 12 వేల మంది విద్యార్థులకు రాజీ లేకుండా నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కేజీబీవీ, గురుకుల విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలల వంట మనుషులతో తన కార్యాలయంలో సమీక్షించారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు బయటి ఆహారం తీసుకొని అస్వస్థతకు గురయ్యారని, అయినా ప్రభుత్వ పాఠశాలలపై విమర్శలు వస్తున్నాయని, ఇలాంటి వాటికి తావివ్వరాదని పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్ కుమార్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.


