బాధితులకు ఊరట | - | Sakshi
Sakshi News home page

బాధితులకు ఊరట

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

పెద్దపల్లి: వ్యవసాయ బావులు, నివాసాల్లో విద్యుత్‌ ప్రమాదాలతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కలిగించింది. గతంలో చెల్లించే పరిహారాన్ని పెంచుతూ విద్యుత్‌ నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇస్తుండగా దానిని రూ.8 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశువులకు చెల్లించే పరిహారరాన్ని గతంలో మాదిరిగా రూ.40 వేలు చెల్లించాలని నిర్ణయించిందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ గంగాధర్‌ తలిపారు.

అర్ధంటపాటు నడవాలి

పెద్దపల్లి: సంపూర్ణ ఆరోగ్యం కోసం అందరూ రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవా లని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమో ద్‌ కుమార్‌ కోరారు. ప్రజా పాలన.. ప్రగతి ప్ర ణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐటీఐ మైదానం నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రి వరకు సోమవారం వాక్‌థాన్‌ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, సరైన సమయంలో, సరైన మోతాదులో ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మున్సిపల్‌ క మిషనర్‌ వెంకటేశ్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొ సైటీ జిల్లా అధ్యక్షుడు కావేటి రాజగోపాల్‌, స భ్యులు బోడకుంట రామకృష్ణ, మీచాల సత్య నారాయణ, రేకులపల్లి శశాంక్‌, ప్రతినిధులు రాజమౌళి, కొట్టె లక్ష్మయ్య, శ్రవణ్‌, మమత, సంయుక్త, విద్యార్థులు పాల్గొన్నారు.

బీజేపీ జెండా ఎగురవేస్తాం

పెద్దపల్లి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షు డు కర్ర సంజీవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సు ల్తానాబాద్‌, శాసీ్త్రనగర్‌, పూసాలలో సోమరవారం నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ యా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు, నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, సౌదరి మహేందర్‌ యాదవ్‌, మిట్టపల్లి ప్రవీణ్‌, కామని రాజేంద్ర ప్రసాద్‌, చాతరాజు రమేశ్‌, కోట నాగేశ్వర్‌, కొల్లూరి సంతోష్‌, కొ మ్మిడి రాజేందర్‌రెడ్డి, వడ్లకొండ శశివర్ధన్‌, మ ల్క భాగ్యలక్ష్మి, పెరక రమేశ్‌, మారం రమేశ్‌, ఏనుగు రాజిరెడ్డి, వి.కిరణ్‌ పాల్గొన్నారు.

ప్రథమ చికిత్స పోటీలు

గోదావరిఖని: ఆర్జీ–1లోని జీడీకే–1, 3గనిపై సోమవారం ప్రథమ చికిత్స పోటీలు నిర్వ హించారు. గాయపడినవారికి సీపీఆర్‌, చికిత్స చేయడం, వారిని అంబులెన్స్‌లో సకాలంలో ఆస్పత్రికి తరలించే అంశాలపై పోటీ నిర్వహించారు. కార్యక్రమములో ప్రథమ చికిత్స తనిఖీ బృందం ఎస్‌.సాయిప్రసాద్‌, కె.ఉదయ్‌కుమార్‌, జి.మధుబాబు, గని ఏజెంట్‌ ఎల్‌.రమేశ్‌, గనిమేనేజర్‌ సుధీర్‌జక్కుల్‌వార్‌, రక్షణ అధికారి శ్రీను పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement