కోల్‌సిటీ: వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగేలా రోడ్లపై ఇసుక, కంకర పోస్తే తగిన చర్జీ వసూలు చేయడంతోపాటు జరిమానా విధిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, 52వ డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి సోమవారం ఆయన కాకతీయనగర్‌లో పర్యటించారు. కంకర, ఇసుక రోజుల తరబడి రోడ్లపై ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దుకాణ యజమానులు సామగ్రిని రోడ్డుపై పెట్టొద్దని సూచించారు. జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్, బాబ్‌కార్ట్‌లు, 15 మంది సిబ్బందితో మురుగునీటి కాలువలో సుమారు కిలో మీటర్ దూరం వరకు పూడిక తీశారు. పిచ్చిమొక్కలు, చెట్లకొమ్మలు తొలగించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఏఈ జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, జవాన్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
సౌకర్యాల కల్పనకు రూ.20 కోట్లు
రామగుండం: సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ రూ.20 కోట్లు వెచ్చించాలనే ఆదేశాల మేరకు ప్రతీవీధిలో రహదారుల విస్తరణతో ఊహించని అభివృద్ధి సాగుతోందని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. 25వ డివిజన్ మల్యాలపల్లిలో రూ.మూడు కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీవీధిలోని చివరి ఇంటివరకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లేలా విస్తరిస్తున్నామన్నారు. కార్పొరేటర్ సిరిశెట్టి సతీశ్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు అయోధ్యసింగ్‌ఠాకూర్, ఈదునూరి హరిప్రసాద్, కార్పొరేటర్లు ఇసంపెల్లి అంజులు, దాసరి సాంబమూర్తి, వడ్లూరి రవి, అప్పాసి శ్రీనివాస్, బల్వన్‌సింగ్‌ఠాకూర్, యాసిన్, జబ్బార్, మోసం పృఽథ్వీ తదితరులు ఉన్నారు.


