పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనాన్ని రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రకటించడం సంతోషకరమని అంబేడ్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య అన్నారు. బ్రాహ్మణపల్లిలో సోమవారం వైస్‌చైర్మన్ కొంకటి లింగమూర్తి, నారాయణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ భవనం ఎంతోఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 14లోపే స్టడీ సర్కిల్ పనులు ప్రారంభిస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారని వారు పేర్కొన్నారు.
‘రామాయణం’పై అవగాహన
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి రామాయణం పరీక్షలు నిర్వహించారు. వేదపండితుడు కొండపాక శ్రీనివాసాచార్యులు రామాయణం విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శ్రీరాముని జీవితం మానవాళికి ఆదర్శమని, ఆయన చూపినబాటలో ముందుకు సాగాలని సూచించారు. పరీలక్షకు 22 పాఠశాలలకు చెందిన 134 మంది విద్యార్థులు హాజరయ్యారని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జడల సురేందర్, నగర సంయోజక్ మణిదీప్, చందు, జాగర్ల సతీశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.


