గోదావరిఖని: రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్‌యూటీసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్‌కు అరుదైన గౌరవం లభించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ, ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది. జీహెఆర్‌టీ ఇండియా సంస్థ, వెబ్‌బైక్ యూనివర్సిటీ, ఏఐయూ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో శనివారం కార్యక్రమం నిర్వహించారు.
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో క్లిష్టమైన ఆర్థో ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన గంగారం గంగమ్మ(80) ప్రమాదవశాత్తు జారిపడి తొంటి ఎముక విరిగింది. తీవ్రగాయమైన గంగమ్మను బంధువులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. శనివారం బాధితురాలికి డాక్టర్ కుమార్ ఆర్థో సర్జన్ 4గంటలు శ్రమించి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ బంధువులు ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆర్థో సర్జన్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో ముందుకు
గోదావరిఖని: అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్లడమే ధ్యేయంగా సామాజిక సమతా వేదిక ఉద్దేశమని నాయకులు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 5న జగ్జీవన్‌రావు, సాయంత్రం అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన ఉంటుందన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలు, మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేడ్కర్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. నాయకులు కె.స్వామి, గుమ్మడి కుమారస్వామి, పెంట రాజేశ్, మాదాసు రామ్మూర్తి, కోటగిరి పాపయ్య, పర్లపల్లి రవి, జేవీరాజు, రాసపెల్లి రవికుమార్, పులి మోహన్, కాసిపేట శివాజీ, కల్వల సంజీవ్, చింటూ, శ్రావణ్, గన్నాల శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు.


