రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శుక్రవారం పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు. తొలుత రామునిగుండాల, ఆబాది రామగుండంలోని స్వయంభూ శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికుడు తిప్పని సత్తయ్య రామునిగుండాల విశిష్టతను వివరించారు. ఆబాది రామగుండంలోని శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో పూజారి విజయ్‌కుమార్ ఆచార్య, ఆలయ కమిటీ ప్రతినిధి సాయి తదితరులు సీపీ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చేరుకున్న సీపీ దంపతులకు ఎస్‌ఆర్‌ఎం కన్‌స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్‌గౌడ్ మూలవిరాట్ చిత్రపటాన్ని బహూకరించి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ దాత మంగీలాల్, కోల కు సుమకుమారి, రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.


