పెద్దపల్లి: జిల్లాలో ఈనెల 5న బాబూ జగ్జీవన్‌రామ్, 14న అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకుందామని జయంతి ఉత్సవ కమిటీ విన్నవించింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం కమిటీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. కుల, మతాలకు అతీతంగా అందరూ హాజరై మహనీయుల జయంతి పండుగలను విజయవంతం చేయాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవ కమటీ చైర్మన్ అంబాల రాజేందర్, ప్రతినిధులు ఆరెల్లి మల్లేశ్, బొంకూరి కై లాసం, బొంకూరి సురేందర్ సన్నీ, లింగమళ్ల శంకరయ్య, కోండ్ర శంకర్, కుక్క కనకరాజ్, తుల్లా నాగరాజ్, కుక్క ఆశోక్, బొంకూరి నరేందర్, బొంకూరి నవీన్‌బాబు, కల్లేపల్లి రవి, కొంకటి లింగమూర్తి, కల్వల మల్లేశ్, పెర్క శివకుమార్, ఈదునూరి విజయ్, కాసిపాక వాసు, కనుకుంట్ల సదానందం, కుక్క శ్రావణ్ కుమార్, బొంకూరి రమేశ్, దొమ్మటి సదయ్య, అంబాల నరేశ్, పెర్క సతీశ్, కల్లేపల్లి అశోక్, రామిళ్ల శారద, గూల్ల రాజు, సత్యనారాయణ, సలిగంటి రామలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


