నేడు 60 డివిజన్లలో సభలు | - | Sakshi
Sakshi News home page

నేడు 60 డివిజన్లలో సభలు

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

● బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ

● బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ

కోల్‌సిటీ: రామగుండం నగరంలో గురువారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపడతామని కమిషనర్‌ అరుణశ్రీ తెలిపారు. ఉదయం 10 గంటలకు 60 డివిజన్లలో ఏకకాలంలో వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. సంక్షే పథకాలు, సమస్యలు గుర్తించి పరిష్కారంపై చర్చిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పింఛన్లు, షాదీముబారక్‌, కొత్తరేషన్‌ కార్డులు తదితర పథకాలపై చర్చ ఉంటుందని తెలిపారు.

సభలపై సమీక్ష

సభల నిర్వహణపై బల్దియా అధికారులు, సిబ్బందితో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ అరుణశ్రీ బుధవారం స్నాహక సమావేశం నిర్వహించారు. సభసజావుగా జరగడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement