పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు గూడ రమేశ్‌శర్మ, సాయినాథ్ ఆధ్వర్యంలో పత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరి మహేందర్, మిట్టపల్లి మురళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, కందుకూరి ప్రకాశ్, ముస్త్యాల రవీందర్, వేగోళం అబ్బయ్య,రాజు, మాజీ సర్పంచ్ పద్మ, సాంబయ్య, తుమ్మ రాములు, మేరుగు వెంకటేశ్, వేగోళం శంకర్, అల్లంకి ఆనందం పాల్గొన్నారు. నీరుకుల్ల రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ చంద్రకుమార్‌ను సన్మానించారు.


