కాల్వశ్రీరాంపూర్: మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వరంగల్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ మార్చి 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రభాకర్–వసంతాదేవి దంపతులను కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ సన్మానించారు. మాజీ సర్పంచులు సత్యనారాయణరెడ్డి, సతీశ్, నాయకులు, గుడ్ల శ్రీనివాస్, బైరి రాజవీరు. సంపత్, ఓదెలు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, గంగారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.


