సింగరేణి వెనుకంజ | - | Sakshi
Sakshi News home page

సింగరేణి వెనుకంజ

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం చేరుకోలేకపోయింది. టార్గెట్‌లో కేవలం 81శాతమే నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈసారి బొగ్గు ఉత్పత్తిలో సింహభాగం గతంలో ఉన్న లోటును పూడ్చేందు(బ్యాక్‌ ఫిల్లింగ్‌)కే కేటాయించారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి భారీగా తగ్గిందనే చర్చ సాగుతోంది.

వెనుకబడిన 10 ఏరియాలు..

వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణి బొగ్గు గనులు వెనకపడ్డాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా 58 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించి 81 శాతం నమోదు చేసిది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో 2 ఏరియాలు వందశాతం ఉత్పత్తి సాధించగా, మిగతా 10 ఏరియాలు లక్ష్యం చేరుకోలేకపోయాయి. ఈసారి బ్యాక్‌ఫిల్లింగ్‌తోనే ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోయాయి. బొగ్గు నిల్వల లోటును పూడ్చేందుకు సీఎండీ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో మూడునెలలుగా బొగ్గు ఉత్పత్తి భారీగా సాధించినా లోటును పూడ్చడానికే సరిపోయింది. మరోవైపు.. లాభాల్లో సింగరేణి ఉద్యోగులకు వాటా వచ్చే విషయం కూడా అనుమానమే అని అధకారులు బాహాటంగానే చెబుతున్నారు. ఈక్రమంలో సింగరేణి సంస్థ ఆర్థిక గణాంకాలు పూర్తయితే తప్ప వాస్తవ లాభాలు ప్రకటించే అవకాశం లేదు.

భారీగా తగ్గిన బొగ్గు ఉత్పత్తి బ్యాక్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ కారణం

టార్గెట్‌ 72 మిలియన్‌ టన్నులు సాధించించి 58 మిలియన్‌ టన్నులు

2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి

సాధించిన బొగ్గు ఉత్పత్తి(మిలియన్‌ టన్నుల్లో)

ఏరియా లక్ష్యం సాధించింది శాతం

ఆర్జీ–1 46.90 36.53 81

ఆర్జీ–2 98.70 87.56 89

ఆర్జీ–3 65.00 46.15 71

ఏపీఏ 15.50 1.71 11

భూపాలపల్లి 46.54 27.90 60

కొత్తగూడెం 92.05 84.36 92

సత్తుపల్లి 64.45 66.38 103

ఇల్లెందు 50.00 24.65 49

మణుగూరు 11.49 10.54 92

బెల్లంపల్లి 35.00 35.35 101

మందమర్రి 27.80 19.81 71

శ్రీరాంపూర్‌ 65.16 44.06 68

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement