రైల్వే కార్మికుల నిరసన | - | Sakshi
Sakshi News home page

రైల్వే కార్మికుల నిరసన

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

రైల్వే కార్మికుల నిరసన మున్నూరుకాపు సంఘం భవనానికి భూమి కేటాయించాలి

రామగుండం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్‌ కోడ్‌లను వ్యతిరేకిస్తూ రామగుండంలో రైల్వే కాంట్రాక్టు కార్మికులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భిక్షపతి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌కోడ్‌లు అమలులోకి తీసుకు రావడం సరికాదన్నారు. వీటిని రద్దు చేయకేంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రైల్వే కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ అండ్‌ ఆల్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ అనుబంధ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి బొంకూరి మహేశ్‌, కోశాధికారి తిరుపతి, సరళ, రాధ, ఈదునూరి బాబు, అవినాష్‌, శ్రీకాంత్‌, దేవేందర్‌, సుక్క కుమార్‌, బాలాజీ, సుమన్‌, అమృత, పద్మ, మహేశ్వరి తదితరులు ఉన్నారు.

లేబర్‌ కోడ్‌లు ఎత్తివేయాలి

పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లు ఎత్తివేసే వరకు ఉద్యమం ఆగదని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు ఎరవెల్లి ముత్యంరావు, కడారి సునీల్‌, బి.అశోక్‌ అన్నారు. లేబర్‌ కోడ్‌లను రద్దుచేయాలనే డిమాండ్‌తో తొలుత జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. లేబర్‌ కోడ్‌లు రద్దుచేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు బిక్షపతి, సీపెల్లి రవీందర్‌, జ్యోతి, తాండ్ర అంజయ్య, పూసల రమేశ్‌, పేర్క రాయమల్లు, మేకల సతీశ్‌, శివరామకృష్ణ, యాకుబ్‌, సాగర్‌, నరేశ్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ సాంస్కృతిక సేన కార్యవర్గం

పెద్దపల్లి: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా పిట్ట రమేశ్‌, ప్రధాన కార్యదర్శిగా తూండ్ల రాజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేశ్‌, రాజయ్య మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. గౌరవ అధ్యక్షుడిగా బుర్రగడ్డ రవి, ఉపాధ్యక్షుడిగా పోలివేణి శ్రీనివాస్‌, కోశాధికారిగా దాసరి శ్రీనివాస్‌, ప్రచార కార్యదర్శిగా పూసాల రమణాచారి, ముఖ్య సలహాదారుగా మంద భాస్కర్‌ యాదవ్‌, సహాయక కార్యదర్శి బియ్యన్న తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కమేర పద్మ, ప్రధాన కార్యదర్శి కోండ్ర సునీత, కార్యవర్గ సభ్యులుగా కన్నూరి రాజయ్య, తాండ్ర మహేశ్‌, భర్ల తిరుపతిని ఎన్నుకున్నామని తెలిపారు.

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 20 గుంటల భూమిని మున్నూరుకాపు సంఘం భవనానికి కేటాయించాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకృష్ణ, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కందుకూరి ముత్యాలు, ప్రధాన కార్యదర్శి అమిరిశెట్టి రాజలింగం, వార్డు కౌన్సిలర్‌ గాజుల రాజమల్లయ్య, కామ సంపత్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement