పెద్దపల్లిరూరల్: రానున్న మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ కోరారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల నరేశ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఈనెల 15న అసెంబ్లీ స్థాయి క్రికెట్ పోటీలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్నామని, క్రీడాకారులు పాల్గొనాలని ఆయన కోరారు. నాయకులు ప్రసాద్, రాజు, తిరుమలేశ్, అయుబ్, అభినయ్, మధుకర్, శ్రవణ్, రాజు, రాహుల్, అజయ్, దేవేందర్‌రెడ్డి, ఆరగొండ రాజ్‌కుమార్, రాకేశ్, గుర్రాల వాసు, స్వామి తదితరులు ఉన్నారు.
ఆస్తిపన్నులో 5శాతం రాయితీ
కోల్‌సిటీ: ముందస్తు ఆస్తిపన్ను చెల్లించే వారికోసం ప్రభుత్వం ఎర్లీబర్డ్ ఆఫర్ వర్తింపజేస్తోంది. 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన ఆస్తిపన్ను ఈనెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ పథకం ద్వారా పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ కల్పిస్తున్నామని బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
జ్యోతినగర్: హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి పావనం, జోగు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని మంథని మున్సిపాలిటీ కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్, ఎస్‌ఆర్‌ఎం కన్‌స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్‌గౌడ్ జోగు సమర్పించి పూజలు చేశారు. మేరుగు యాదగిరిగౌడ్, బాలసాని స్వామి గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, అధిక సంఖ్యలో గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని మంచిరామిలో సర్పంచ్ ఉప్పు లక్ష్మి ఆధ్వర్యంలో కోతుల బెడద నియంత్రణకు బుధవారం సిబ్బందితో కొండెంగ వేషధారణ వేయించి వినూత్న ప్రయోగం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ గత సంవత్సరం కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు భయందోళనకు గురి కాగా సొంత ఖర్చులతో కోతులను పట్టించి అడవుల్లో వదిలివేసినట్లు తెలిపారు. మళ్లీ కోతుల బెడద ఎక్కువ కావడంతో కొండెంగ వేషధారణతో తరిమివేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్, పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.


