పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని రైస్‌మిల్ కెనాల్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లజెండాలు, బ్యాడ్జీలతో బుధవారం నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య మాట్లాడుతూ లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసమరించుకోవాలని కోరారు. మండల కోకన్వీనర్ మాతంగి రాజమల్లు, రైస్‌మిల్ ఆపరేటర్ల సంఘం, కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు, కల్లెపెల్లి ప్రసాద్, కొల్లూరు తిరుపతి, మంజూర్, ప్రభాకర్, శ్రీశైలం, చొప్పరి రాజు, తిరుపతి, ఓదెలు, బాలకృష్ణ, సుధాకర్‌రావు, రాము, కిరణ్, రాజు, రాజేశం, శీను, రమేశ్, సారయ్య, అశోక్, మహేందర్, మురళి, అనిల్, సంతోష్, సంపత్, శ్రీధర్, రవీందర్ పాల్గొన్నారు.
జ్యోతినగర్: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద జేఏసీ నాయకులు బుధవారం కార్మికులకు నల్లబ్యాడ్జీలు ధరింపజేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ చట్టాలను అమలు చేయాలని జారీ చేసిన జీవోలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు చిలుక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, భూమల్ల చందర్, ఇజ్జగిరి భూమయ్య, తోకల రమేశ్, సత్యం పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
రామగిరి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఐటీయూ ఆర్జీ–3 బ్రాంచ్ సెక్రటరీ డి.కొమురయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, రవికుమార్, గోపాల్, సదానందం పాల్గొన్నారు.


