రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో కాసుల వర్షం కురిసింది. కరీంనగర్, గంగాధర, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ రూరల్, భీమదేవరపల్లి, మల్యాల, కోరుట్ల, మంథని, సుల్తానాబాద్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామగుండం, మెట్‌పల్లి, వేములవాడ, జగిత్యాలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 82,249 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.210.83 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
నెల రిజిస్ట్రేషన్లు ఆదాయం
(రూ.కోట్లలో)
ఏప్రిల్ 6,754 రూ.18.64
మే 8,108 20.17
జూన్ 7,446 19.10
జూలై 6,962 16.71
ఆగస్టు 6,546 16.92
సెప్టెంబర్ 6,756 17.20
అక్టోబర్ 6,210 15.15
నవంబర్ 6,625 17.56
డిసెంబర్ 6,524 18.06
జనవరి 6,238 15.77
ఫిబ్రవరి 6,652 17.95
మార్చి 7,428 17.60


