తక్కువ పీఎల్‌ఎఫ్‌ లోడ్‌తో విద్యుత్‌ ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

తక్కువ పీఎల్‌ఎఫ్‌ లోడ్‌తో విద్యుత్‌ ఉత్పత్తి

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

జ్యోతినగర్‌: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రెండు విద్యుత్‌ ప్రాజెక్టుల్లో విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ తగ్గించి విద్యుత్‌ తయారుచేయడం గమనార్హం. రామగుండం ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 2,600 మెగావాట్లు కాగా 13,757 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. మార్చిలో 1,242 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించి 64 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌) నమోదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 13,757 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని 60 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి చేసింది. ఇక తెలంగాణ స్టేజ్‌–1లోని 1,600 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులో 2025–26లో 10,786 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను 58 శాతం పీఎల్‌ఎఫ్‌, గత మార్చిలో 969 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను 62 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌తో సాధించింది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి నేపథ్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించిన విషయం విదితమే.

రామగుండం ప్రాజెక్టులో 13,757

మిలియన్‌ యూనిట్లు

తెలంగాణ స్టేజ్‌–1 ప్రాజెక్టులో 10,786

మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement