పెద్దపల్లి
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
7
పెద్దపల్లిరూరల్/జూలపల్లి/ఎలిగేడు/ధర్మారం/పాలకుర్తి/ఓదెల/కాల్వశ్రీరాంపూర్: జిల్లాలో ని ఏడు మండలాల్లో మంగళవారం వేకువజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సుమారు 55 గ్రామాల్లో మొక్కజొన్న, వరితో కలిపి సాగుచేసిన రైతులు 1,757 మంది తీవ్రంగా నష్టపోయారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటలో నేలవాలిన పంటలను ఇన్‌చార్జి డీఏవో కాంతారావు స్థానిక వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు.
భారీగాలులతో కూడిన వర్షం
భారీ గాలులకు మామిడితోటల్లో కాయలు, చింతకాయలు రాలిపోయాయి. స్థానికులు ఉచితంగా తీసుకెళ్లేందుకు పోటీపడ్డట్టు సమాచారం. ధర్మారంలో 3.3 మి.మీ., అంతర్గాంలో 17.4 మి.మీ., రామగిరిలో 3.4 మి.మీ., జూలపల్లిలో 1.0 మి.మీ., ఓదెలలో 2.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు సీపీవో కార్యాలయ వర్గాలు తెలిపాయి.
పంట నష్టంపై ప్రాథమిక అంచనా..
ఈదురుగాలులతో కూడిన వర్షంతో పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయాధికారులు ప్రాథ మిక అంచనాకు వచ్చారు. జిల్లావ్యాప్తంగా వరి 410 ఎకరాలు, మొక్కజొన్న 1,821 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ప్రాథథమిక అంచనాకు వచ్చారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో వరి అత్యధికంగా 271 ఎకరాల్లో దెబ్తిన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్వశ్రీరాంపూర్‌లో 443 ఎకరాల్లో మొక్కజొన్న కూడా దెబ్బతిన్నట్లు వివరించారు.
వంగిన ఆలయ కమాన్
రామగుండం: స్థానిక శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ కమాన్ ఈదురుగాలుల ధాటికి వంగిపోయింది. కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం కమాన్ నిర్మించారని స్థానికులు చెబుతున్నారు.
జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు
నేలవాలిన మొక్కజొన్న, వరి, మామిడి
మొత్తం 2,231 ఎకరాల్లో పంటలకు నష్టం
వ్యవసాయ శాఖ అంచనా


