తెలంగాణ స్టేజ్‌–2కు అడుగులు | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్టేజ్‌–2కు అడుగులు

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

తెలంగాణ స్టేజ్‌–2కు అడుగులు

జ్యోతినగర్‌: తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు స్టేజ్‌–2 నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈమేరకు ఎన్టీపీసీ నుంచి రూ.15,500 కోట్ల ఆర్డర్‌ను భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌) దక్కించుకుంది. ఒక్కోటి 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంగల మూడు యూనిట్లను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మించనున్నారు.

పనులు ప్రారంభం

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు స్టేజ్‌–2 నిర్మాణం కోసం ఇప్పటికే స్థలం కేటాయించారు. పర్యావరణ అనుమతులు, కోల్‌లింకేజీ, బూడిద చెరువు నిర్మాణానికి భూసేకరణ తదితర పనులన్నీ సిద్ధం చేశారు.

పీపీఏలోనే జాప్యం

విద్యుత్‌ కొనుగోలు కోసం రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు ఒప్పందం చేసుకోలేదు. దీంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి లేఖ కూడా రాశారు. తెలంగాణ ప్రభుత్వం పీపీఏ(పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌)చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రాజెక్టు స్వరూపం ఇది..

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆవరణలోనే తెలంగాణ స్టేజ్‌–2 ప్రాజెక్టు నిర్మిస్తారు. ఇందులో ఒక్కోటి 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంగల మూడు యూనిట్లు ఉంటాయి. మెయిన్‌ ప్లాంట్‌ ప్యాకేజీ పనుల్లో ప్రధానంగా బాయిలర్‌, టర్బైన్‌, జనరేటర్‌ ఉంటాయి. ప్రాజెక్టు డిజైన్‌, ఇంజినీరింగ్‌, తయారీ, సరఫరా, నిర్మాణం, ప్రారంభించడం, పరీక్షించడం తదితర అంశాలపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. అయితే, నోటిఫికేషన్‌ ఆఫ్‌ అవార్డ్‌(ఎన్‌వోఏ) తేదీ నుంచి 62 నెలలోగా ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.

రూ.15,500 కోట్లకు బీహెచ్‌ఈఎల్‌ ఆర్డర్‌

62 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement