కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. న గరంలోని రాంనగర్‌లో నివాసముంటున్న ఇస్లావత్ కిషన్(55) మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం స్వగ్రామం సిద్దిపేట జి ల్లా కోహెడ మండలం జ్యోతిరాంనాయక్ తండాకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌కు వస్తుండగా, అల్గునూర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనకనుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.


