పెద్దపల్లిరూరల్: జిల్లా పంచాయతీ అధికారి వీరబు చ్చయ్య మంగళవారం ఉద్యో గ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ శ్రీహర్ష హాజరయ్యారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తప్పనిసరన్నారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, అధికారులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు
జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్ మహాత్మా గాంధీ క్రీడామైదానంలో మంగళవారం రాత్రి పోటీలు జరిగాయి. రామగుండం, సింహాద్రి జట్లు పోటీపడ్డాయి. రామగుండం జట్టు 16 పాయింట్లు పొంది విజయం సాధించింది. పోటీల్లో సదరన్ రీజియన్‌లోని సింహాద్రి, కుడ్గి, వల్లూరు, రామగుండం, కాయంకుళం జట్లు హాజరయ్యాయి.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు
మంథని: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మంథనికి చెందిన చంధ్రుపట్ల సునీల్‌రెడ్డిని నియమించారు. తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన బాధ్యతకు అన్నివిధాలుగా కట్టుబడి ఉంటానని సునీల్‌రెడ్డి పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మదర్ థెరిసాలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్
పెద్దపల్లిరూరల్: మదర్ థెరి సా ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం ఐసీఈఎండీటీ – 2కే26 పేరిట అంతర్జాతీ య టెక్నికల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేఎన్టీయూ హెచ్‌వోడీ సతీశ్‌కుమార్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ సంబిసన్‌తో కలిసి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్‌కుమార్ రెండురోజుల కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధఅంశాలపై ఇచ్చిన ప్రదర్శనలను తిలకించారు. నవసమాజ నిర్మాణంలో ఉత్తమ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలిస్తూ ఆలోచనాశక్తి పెంపొందించుకునేందుకు అంతర్జాతీయ స్థా యి కాన్ఫరెన్సు ఉపకరిస్తుందని అన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ గాజుల కిశోర్‌కుమార్, హెచ్‌వోడీ కొంతం శ్రీధర్, రమేశ్, వంశీరాజ్, రవి, సవిత, సదానందం, సంతోష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, జయంత్‌రెడ్డి ఉన్నారు.
స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక పోటీలు
పెద్దపల్లి: స్థానిక ఐటీఐ మైదానంలో మంగళవారం స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి శారద పోటీలు ప్రారంభించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని డీఈవో కోరారు. జిల్లా యువజన క్రీడా అధికారి సురేశ్ మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో 28 మంది బాలబాలికలు మాజరయ్యారని, ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల సురేందర్, దాసరి రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుల శోభా రాణి, కొమురోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జేఎన్టీయూ విద్యార్థులకు రోస్ స్కాలర్‌షిప్
రామగిరి: మంథని జేఎన్టీయూలోని ముగ్గురు విద్యార్థులు రోస్(రాయల్ ఆర్గనైజేషన్ ఫర్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్) స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఈ సామాజిక సేవా సంస్థ విద్యారంగంలో ప్రతిభ కనబరుస్తున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఏటా స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. ఈవిద్యా సంవత్సరానికి మంథని జేఎన్టీయూలో మైనింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఇమ్ముడి శరత్‌కుమార్, ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీఎన్‌ఎన్ విభాగానికి చెందిన బత్తుల శ్రావణి, తాటిసాయి శరణ్యను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్కాలర్‌షిప్ ద్వారా ఒక్కో విద్యార్థికి ఏటా రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఎంపిక పత్రాలను ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్ మంగళవారం విద్యార్థులకు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్, పరిపాలనాదికారి సుమన్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యుద్ధోన్మాదాన్ని ఖండించండి
పెద్దపల్లి: అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యద ర్శి కుమారస్వామి కోరారు. విరసం జిల్లా కన్వీనర్ బాల సాని రాజయ్య అధ్యక్షతన ఇ రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా స్థానిక బస్టాండ్ వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ప్ర జలపై చేస్తున్న దాడులు మానవత్వానికి విఘాతంగా మారుతున్నాయన్నా రు. సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే యుద్ధం చేస్తున్నారని ధ్వజమె త్తారు. యుద్ధం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధ రలు రవాణా ఖర్చులు పెరిగి ఆహార పదార్థాల ధరలపై తీవ్రప్రభావం చూపుతాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిచవరకు సాధారణ ప్రజలకు గుదిబండగా మరుతుందని అన్నారు. ఇప్పటికై నా యుద్ధం ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు వెల్తురు సదానందం, రత్నకుమార్, తాంద్ర సదానందం, మార్వడి సుదర్శన్, కోరేఫు మల్లేశ్, రమేశ్, అరికిళ్ల లలితక్క, పెర్కా సతీశ్, బాలసాని లెనిన్, తిప్పరపు సురేశ్, పులిపాక రవీందర్, గోపాల్ యాదవ్, బొంకురి లక్ష్మణ్,రాజు, రాజగోపాల్, తాళ్లపెల్లి మల్లయ్య, తిర్రి బాలకృష్ణ, శ్రావ్య, స్మయిలి, శ్వేతా తదితరులు పాల్గొన్నారు.


