పెద్దపల్లి: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆదేశాల మేరకు మూడు నెలల కోటా రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. రేషన్‌కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేస్తామని డీఎస్‌వో శ్రీనాథ్ తెలిపారు. అయితే, మూడు నెలల కోటా కోసం ఒక్కో కార్డుదారు ఈపాస్ యంత్రంలో మూడుసార్లు వేలిముద్ర వేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
డీలర్ల వద్ద స్థలం కొరత
ఇప్పటికే పలు రేషన్‌దుకాణాల్లో దొడ్డుబియ్యం మిగులు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా వెనక్కి తీసుకెళ్లి గోదాముల్లో నిల్వచేయడం లేదు. దీంతో ప్రస్తుతం సరఫరా చేస్తున్న మూడు నెలల కోటా బియ్యం నిల్వచేసేందుకు తమ వద్ద స్థలం సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని డీలర్లు అంటున్నారు. దీంతో స్టాక్‌ను ఎప్పకప్పుడు లారీల ద్వారా చేర్చాలని కోరుతున్నారు.


