పెద్దపల్లి: బీఎస్‌ఎన్‌ఎల్ చేపట్టే భూగర్భ కే బుల్ పనులను సమన్వయంతో పూర్తిచేయా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అండర్‌గ్రౌండ్ కేబుల్ నిర్మాణంపై సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో క లిసి కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షించా రు. రామగుండంలో ధ్వంసమైన చోట్ల మ రోసారి అండర్‌గ్రౌండ్ కేబుల్ వేస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, తాగునీటి పైప్‌లైన్లు, రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో అండర్‌గ్రౌండ్ ధ్వంసం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీవో కాళిందిని, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ కుమారస్వామి పాల్గొన్నారు.
కేజీబీవీల్లో బాలికలకు శిక్షణ
పెద్దపల్లి: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థినులను జాతీయస్థాయి పో టీపరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని జిల్లా బాలికల అభివృద్ధి అధికా రి కవిత తెలిపారు. జూలపల్లిలో నీట్, రామగుండంలో జేఈఈ, సుల్తానాబాద్‌లో క్లాట్‌లో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామన్నా రు. పట్టణ విద్యార్థులతో సమానంగా గ్రామీ ణ బాలికలకు అన్నిరంగాల్లో అవకాశాలు క ల్పించాలనేది దీని లక్ష్యమని వివరించారు.
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమ వారం క్వింటాల్‌కు రూ.7,455 ధర పలుకగా.. మంగళవారం గరిష్టంగా రూ.7,611 పలి కిందని మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. కనిష్టంగా 5,544గా, సగటు రూ.7,272గా ధర ఉందని వివరించారు. 300 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగినట్టు వారు పేర్కొన్నారు.
మహనీయుల జయంతికి అధిక ప్రాధాన్యం
పెద్దపల్లి: మహనీయుల జయంతి నిర్వహణ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. జయంతి నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవా రం తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ నెల 5న బాబూ జగ్జీవన్‌రామ్, 14న అంబేడ్కర్ జయంతి ఉంటాయని, వీటిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వీరి జీవిత చరిత్ర తెలిసేలా ప్రచారం చేయాలన్నారు.
నేడు బ్లాక్‌డే పాటించాలి
పెద్దపల్లి: కేంద్రప్రభుత్వం అమలు చేసే నాలుగు లేబర్ కోడ్‌ల రద్దును డిమాండ్ చేస్తూ బుధవారం బ్లాక్‌డే నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ డిమాండ్ తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపాలని ఆయన కోరారు.


