● రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఆగిన వైనం
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఒకటో డివిజన్ న్యూపీకే రామయ్య కాలనీ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఉదయం గోదావరిఖని నుంచి లింగాపూర్ మోడల్ స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. అక్కడ విద్యార్థులను దించి గోదావరిఖని వైపు వస్తోంది. ఈక్రమంలో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చిగురుమామిడి(హుస్నాబాద్): చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన మెడవేని రాధిక (25) ఉరేసుకు ని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలి పిన వివరాలు.. సుందరగిరి గ్రామానికి చెందిన రా ధికను 2021లో చిన్నముల్కనూర్‌కు చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి మూడేళ్ల కూతు రు మనస్విని ఉంది. అదనపు కట్నం తేవాలంటూ రాధికను తరుచూ భర్త రమేశ్, అత్త కమలవ్వ వేధింపులకు గురిచేసేవారు. వేధింపులు తట్టుకోలేక సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా చుట్టుపక్కల వారు గమనించి 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


