నేడు భగత్‌సింగ్‌ వర్ధంతి | - | Sakshi
Sakshi News home page

నేడు భగత్‌సింగ్‌ వర్ధంతి

Mar 22 2026 6:04 AM | Updated on Mar 22 2026 6:04 AM

పెద్దపల్లి: దేశస్వాతంత్య్ర సాధనలో అసువులు బాసిన భగత్‌సింగ్‌ వర్ధంతిని ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రత్నకుమార్‌, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌ తెలిపారు. వర్ధంతి ప్రచార పోస్టర్‌ను జిల్లా కేంద్రంలో శనివారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. దేశభక్తులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ అమరత్వాన్ని గుర్తుచేస్తూ, సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 23 తేదీన పల్లెలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని వారు కోరారు. నాయకులు బుద్ధుల రమేశ్‌, వెల్తురు సదానందం, రవీందర్‌, మహేందర్‌, తిర్రి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టీజీ సెట్‌కు అర్హత

పెద్దపల్లిరూరల్‌: పట్టణా నికి చెందిన కుదిర శ్రీల త టీజీ సెట్‌కు అర్హత సాధించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష –2025 ఫలితాల్లో శ్రీలత 152 మార్కులను సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 29 సబ్జెక్టులకు రాష్ట్రవ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచి మార్కులు సాధించిన శ్రీలతను పలువురు అభినందించారు.

పటిష్ట పోలీస్‌ బందోబస్తు

గోదావరిఖనిటౌన్‌: రంజాన్‌ సందర్భంగా నగరంలోని వివిధ ఈద్గాల వద్ద పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చేపట్టారు. తొలుత ఆయన ఫైవింక్లయిన్‌ ఏరియా ఈద్గాను శనివారం ఆయన సందర్శించి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. డీసీపీ మాట్లాడు తూ, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతీఒక్కరు సహకరించాలన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం

మంథనిరూరల్‌: మొక్కలు పెంచి ప్రకృతిని కాపాడాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. ఉపాధిహామీ ద్వారా ఏటా నర్సరీల్లో మొక్కలు పెంచి వనమహోత్సవంలో నాటుతున్నారు. అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది అలసత్వంతో మొక్కలు ఆదిలోనే నశించిపోతున్నాయి. మంథని మండలం ఉప్పట్ల – గుంజపడుగు మధ్య రహదారి వెంట నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మొక్కలు ఏటా ఇలా అగ్నిప్రమాదంలో కాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

4 కిలోల కణతి తొలగింపు

గోదావరిఖని: కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన సింగరేణి కార్మికుడి భార్యకు శస్త్రచికిత్స చేసి 4 కిలోల కణతిని విజయవంతంగా తొలగించారు పలువురు వైద్యులు. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో వైద్య బృందం శ్రమించి జీడీకే–వన్‌ ఇంక్లయిన్‌లో ఉద్యోగి తిరుపతి భార్య సుమలతకు ఆపరేషన్‌ చేసి కణితి వెలికితీశారు. డాక్టర్లు మద్దిలేటి, వినోద్‌కుమార్‌, శ్యామలతోపాటు పారామెడికల్‌ బృందం స్వరూప, రాణి, అశోక్‌, రాములు బృందాన్ని సీఎంవో కిరణ్‌రాజ్‌కుమార్‌, గోదావరిఖని ఏసీఎంవో అంబిక అభినందించారు. విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించి కడుపునొప్పి బాధ నుంచి విముక్తి కల్పించిన వైద్యులకు కార్మికుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement