గోదావరిఖని: సింగరేణి రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3లో గతేడాది దసరా రోజు జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఈపీ ఆపరేటర్ లక్ష్మీనారాయణను కొత్తగూడెం చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్‌రాజ్‌కుమార్ శనివారం పరీక్షించారు. కార్మికుడి ఆరోగ్యపరిస్థితి మెరుగుపడక పోవడంతో ఆయన కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం సింగరేణి డాక ర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతు న్న ఉద్యోగి వివరాలు సేకరించి ప్రత్యేక నివేదిక తయారుచేసి కార్పొరేట్ ఆసుపత్రికి పంపించనున్నట్లు కిరణ్‌రాజ్ కుమార్ తెలిపారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ అంబిక, ఏసీఎంవో శ్రీకాంత్, రామకృష్ణాపూర్ డాక్టర్ వెంకటరమ ణ, డాక్టర్ అరవింద్ ఉన్నారు. డాక్టర్ల నివేదిక అనంతరం కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు బెనిఫిట్స్ విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
సీఎంవో కిరణ్‌రాజ్‌కుమార్


