కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మడంలం మొట్లపల్లి కొత్తకుంట ఒర్రెలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన ఆరోగ్యలక్ష్మి పాలప్యాకెట్లు సుమారు 15 వరకు శుక్రవారం గ్రామస్తులు కనుగొన్నారు. పాలప్యాకెట్లపై డిసెంబర్– 2025 తేదీతో ముద్రణ ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పాలప్యాకెట్లు వృథాగా నీటిపాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూటాలని మొట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్‌రావు కోరారు.


