చిన్నప్పుడు చూసినం
మంథనిలోని యూపీఎస్‌లో నేడు ఏడోతరగతి చదువుతున్న సమయంలో మల్లా రాజిరెడ్డి డిగ్రీ చదువుతాండు. అప్పుడు ఆయనను చూసినం. మళ్లా రెండు, మూడేళ్లకు అడవిలకు పోయిండు. అప్పటి నుంచి ఇప్పటివరకు చూడలే. ఎప్పుడు పల్లెకు వస్తడా? అని ఎదురుచూస్తానం. ఒక్కసారి వస్తే ఊరోళ్లకు సంతోషం అయితది.
– దాదా రాజయ్య, గ్రామస్తుడు. శాస్త్రులపల్లి
ఆయన ఎట్లా ఉంటడో చూడలె
కోరమీసాలతో ఆజానుబావుడిలా ఉండే మల్లా రాజి రెడ్డిని చూస్తే భయపడేవాళ్లం. కానీ ఆయన ఎవరినీ ఒక్కమాట కూడా అనేవాడు కాదు. మేం చిన్నప్పుడే ఆయనను చూసినం. మళ్లా ఇప్పటివరకు ఆయన ఎట్లా ఉంటడో చూడలే. పేపర్లు, టీవీల్లో మాత్రమే ఆయనను చూసినం. ఎట్లైనా సొంతూరికి ఒకసారైనా వస్తడని అనుకుంటున్నం.
– బొట్ల సాయిలు, గ్రామస్తుడు, శాస్త్రులపల్లి
చిన్నప్పుడు చూసినం


