ఘనంగా నాగవెల్లి పట్నం
జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక శ్రీరావుల మల్లికా ర్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవా రం నాగవెల్లి పట్నం వేశారు. యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఆలయానికి చేరుకుని పట్నం వేయించారు. స్వామి వారికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు. యా దవ సంఘం సభ్యులు మారం తిరుపతి యా దవ్, సురేందర్, వెంకటరమణ, నర్సయ్య, మల్లేశం, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.
మట్టి టిప్పర్ల అడ్డగింత
పెద్దపల్లిరూరల్: తమ ఊరు నుంచి మట్టి టి ప్పర్లు ఓవర్‌లోడ్‌తో వేగంగా వెళ్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కుర్మపల్లి గ్రామస్తులు బుధవారం నిరసన తెలిపారు. గ్రామంలో టిప్పర్లను అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం మట్టి తరలిస్తున్న టిప్పర్లు ఇష్టానుసారంగా నడుస్తున్నాయనిని అన్నారు. దుమ్ము, ధూళితో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నా యని సర్పంచ్ లక్ష్మి, నాయకులు రాజలింగు తదితరులు ఆరోపించారు. దుమ్ము, ధూళి లే వకుండా నీళ్లు చల్లించాలని, మూలమలుపుల వద్ద బీటీరోడ్డు వేయించాలని, గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
‘అసంపూర్తి సమాచారం ఇస్తున్నారు’
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం ప్రకారం తాము అడిగిన సమాచారాన్ని అసంపూర్తిగా ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ యూఎఫ్ ఆర్టీఐ జిల్లా కో కన్వీనర్ జంగ చక్రధర్‌రెడ్డి అన్నారు. సమాచార హక్కుచట్టం కమిషనర్లు శ్రీనివాసరావు, భూపాల్, హొహసిన్‌పర్వీన్, అయోధ్యరెడ్డిని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తాము అడిగిన సమాచారం ఇ వ్వకుండా అధికారులు దాటవేస్తున్నారని కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కార్య క్రమంలో యు నైటెడ్‌ఫోరం ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు, లక్ష్మి, నాగేశ్వర్, మల్లేశ్, తిరుపతి, రాజేశం, చంద్రమౌళి, చిరంజీవి, సురేశ్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ డివిజన్ ప్రజలకు మరి న్ని మెరుగైన సేవలు అందించాలని బల్దియా కమిషనర్ అరుణశ్రీ సూచించారు. బల్దియాలో బుధవారం వార్డు ఆఫీసర్లు, సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్షించారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్దిరోజులే గడువు ఉందని, ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, ట్రేడ్‌లైసెన్స్ రుసుం, బకాయల వసూలులో వేగం పెంచాలని సూ చించారు. అమృతమ్ యాప్‌లో వివరాల నమోదు, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, మెప్మా ఎస్‌ఎల్‌ఎఫ్‌ల ఎన్నికలు సకాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శాంతిస్వరూప్, షాభాజ్ తదితరులు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,401
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7401 ధర పలికింది. కనిష్టంగా రూ.5,856గా, సగటు రూ.7,166గా నమోదైందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.
ఘనంగా నాగవెల్లి పట్నం
ఘనంగా నాగవెల్లి పట్నం
ఘనంగా నాగవెల్లి పట్నం


