తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలి
పెద్దపల్లి: విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలు, కలలు నిజం చేయాలని పెద్దపల్లి ఎమ్మె ల్యే విజయరమణారావు సూచించారు. సుల్తానాబా ద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం బు ధవారం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటర్మీడియట్ కీలకదశ అని, భవిష్యత్‌పై సరైన నిర్ణయం తీసుకోవాల్సి సమయం ఇదేనని అన్నారు. హైస్కూల్‌కు పక్కా భవనం నిర్మిస్తున్నామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌రావు, డీఐఈవో కల్పన, ప్రిన్సిపాల్ రామచందర్‌రెడ్డి, హెచ్‌ఎం రత్నాకర్‌రెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడ అబ్బయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సహకరించాలి
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి సహకరించాలని ఉద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ మ హేందర్ ఎమ్మెల్యే విజయరమణారావును కోరారు. ఈమేరకు గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యేను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట నాయకులు ఉమాదేవి, ప్రభాకర్, అఖిల, సుష్మా, స్కైలాబ్ రాణి, వైభవ్, జ్యోతి తదితరులు ఉన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


