మేమేం పాపం చేశాం? | - | Sakshi
Sakshi News home page

మేమేం పాపం చేశాం?

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

మేమేం

మేమేం పాపం చేశాం?

ముత్తారం(మంథని): విజయవాడ – వరంగల్‌ – మంచిర్యాల – నాగ్‌పూర్‌ 363 జాతీయ రహదారి నిర్మాణంలో జీవనాధారం కోల్పోతున్న రైతులు ప రిహారం కోసం ఆందోళన బాటపట్టారు. పనులు చే పట్టిన మెగా కంపెనీ కాంట్రక్టర్లను అడ్డుకుంటున్నా రు. వ్యవసాయ భూములు, బావుల పరిహారంలో వ్యత్యాసాలు ఉన్నాయని, అనర్హులకు పరిహారం చె ల్లించి అర్హులను విస్మరించారని ఆరోపిస్తున్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా న్యా యం జరగడం లేదని వాపోపోతున్నారు. పనిస్థలాల వద్ద రెండ్రోజులుగా నిరసన తెలుపుతున్నారు.

ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి విజయవాడ వర కు 363 జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో మంచిర్యాల నుంచి హనమకొండ వరకు మూడు ప్యాకేజీలు విభజించి రూ.2,606 కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా మంచిర్యా ల – హన్మకొండ మధ్య 108 కి.మీ. పొడవున నాలు గు లేన్లు నిర్మించనున్నారు. మనజిల్లాలో రెండోప్యా కేజీ కింద మంథని మండలం పుట్టపాక నుంచి భూ పాలపల్లి జిల్లా పంగిడిపల్లి వరకు రూ.881 కోట్లతో 38 కి.మీ. మేర రోడ్డు నిర్మిస్తున్నారు. దీనిపరిధిలోగ ల మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 16 గ్రామాల్లో 505 ఎకరాల వ్యవసాయ భూ ములు, బోరుబావులు, పైప్‌లైన్లు, చెట్లు సేకరణ చేసి అవార్డు ప్రకటించారు.

పరిహారంలో వ్యత్యాలు..

మంథని మండలం లక్కారంలోని నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వ్యత్యాసాలు, అనర్హులకు బో రుబావుల పరిహారం చెల్లింపులు, అర్హులను విస్మ రించడం వివాదానికి కారణమైంది. కొన్నిచోట్ల వ్య త్యాసాలు, బోరుబావులు, పైన్‌లైన్లు లేకున్నా ఉన్న ట్లు చూపించి పరిహారం చెల్లించారనేది రైతుల ఆరోపణ. ఇలా రూ.కోట్లలో అవినీతి జరిగిందని, విజిలెన్స్‌ విచారణ చేపడితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని నిర్వాసిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

కంటతడి పెట్టిన మహిళా రైతు

దేవరకొండ సత్తమ్మ

తన భర్త మొగిలి పేరిట లక్కారంలోని 27 గుంటలు రోడ్డు కింద పోతోందని మహిళారై తు దేవరకొండ సత్తమ్మ కంటతడి పెట్టింది. పొట్టకూటి కో సం మంచిర్యాల జిల్లా తాండూరులో ఉంటున్నామని, తన భర్త అనారోగ్యంతో బాధపడు తూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించింది. భూమికి కొంత డబ్బు వచ్చినా, బావికి రాలే దని వాపోయింది. అధికారుల చుట్టూ తాను ఇంకా ఎన్నిరోజులు తిరిగేదని తహసీల్దార్‌ ఎదుట కన్నీరు పెట్టడం అక్కడున్న వారిని వేదనకు గురిచేసింది.

పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు

డబ్బులు చెల్లించాకే భూములిస్తాం

భూనిర్వాసిత రైతుల ఆందోళన

పురుగులమందు డబ్బాలతో నిరసన

మేమేం పాపం చేశాం?1
1/1

మేమేం పాపం చేశాం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement