భూగర్భ గని సందర్శన
గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ: రాష్ట్ర సమాచా ర హక్కు కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మోసిన పర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి బుధవారం ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–2వ గనిని సందర్శించారు. గనిలోకి వెళ్లి పనిస్థలాలను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక, రక్షణ తీరు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీడీకే–5 ఓసీపీని సందర్శించారు. ఓబీ తొలగింపు, బొగ్గు వెలికితీత వివరాలపై ఆరా తీశారు. అనంతరం సుందిళ్ల శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారివెంట ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు, అధికారులు మల్లేశం, రమేశ్, డి.రమేశ్, అల్లావుద్దీన్, శ్రీనివాస్, డీజీఎం(ఫారెస్ట్) కర్ణ, వెంకటేశ్వర్లు, సర్వే ఆఫీసర్ చంద్రమౌళి, వెల్ఫేర్ ఆఫీసర్ గణేశ్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు ఉన్నారు.


