
చట్టాలపై అవగాహన అవసరం
పెద్దపల్లిరూరల్: విద్యావంతులైన యువత చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండి, కుటుంబసభ్యులకూ అవగాహన కల్పించాలని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. స్థానిక మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణితో కలిసి జడ్జి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో వ్యహరించి, ఎంచుకున్న లక్ష్య సాధనకు పాటుపడాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జిల్లా జడ్జి పేర్కొన్నారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్, భా ను, న్యాయవాదులు ఠాకూర్ హనుమాన్‌సింగ్, బర్ల రమేశ్‌బాబు, ఝాన్సీ, శరత్‌కుమార్, ప్రి న్సిపాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సీపీఆర్‌పై అవగాహన
పెద్దపల్లిరూరల్: కార్డియో పల్మనరీ రెసిపిటేషన్(సీపీఆర్)పై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా జడ్జి కుంచాల సునీత సూచించారు. జిల్లా ప్రధాన న్యాయస్థానంలో శనివారం సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి, డీఎంహెచ్‌వో వాణిశ్రీతో కలిసి కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, న్యా యవాదులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ మౌనిక సీ పీఆర్‌పై అవగాహన కల్పించారు. ఉప్పు విని యోగం తగ్గించాలని, అధికబరువును నియంత్రణలో ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు. ప్రోగ్రాం అధికారి రాజమౌళి, కిరణ్‌కుమార్, మమత తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థికి గోల్డ్‌మెడల్
ధర్మారం(ధర్మపురి): హైదరాబాద్‌లోని మహిళా(వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్) యూనివర్సిటీ కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన ధర్మారం మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి జరూష శనివారం గవర్నర్ నుంచి బంగారు పతకం అందుకుంది. 2021–24 బ్యాచ్‌కి చెందిన జరూష బీఏలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ.. జరూషను శాలువాతో సత్కరించి బంగారు పతకం అఽందించారు.
ఆస్తిపన్ను వసూలు చేయాలి
ఎలిగేడు(పెద్దపల్లి): గ్రామాల్లో ఆస్తిపన్ను వసూ లు చేయాలని డీఎల్‌పీవో వేణుగోపాల్ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవో కిరణ్‌తో కలిసి శనివారం పంచాయతీ కార్యదర్శులతో ఆస్తిపన్ను వసూళ్ల ప్రగతిపై సమీక్షించారు. ఈనెల 31వ తేదీ వరకు 50 శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సింగరేణి అధికారుల బదిలీ
గోదావరిఖని: సింగరేణిలోని ముగ్గురు ఐఈడీ అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం శనివారం ఆదేశాలు జారీచేసింది. ఆర్జీ–3 ఏరియాలో పనిచేస్తున్న ఐఈడీ డీజీఎం కె.చంద్రశేఖర్‌ను ఆర్జీ–2 ఏరియాకు బదిలీ చేశారు. ఆర్జీ–2 ఏరియాలో పనిచేస్తున్న ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ ఆర్జీ–3 ఏరియాకు బదిలీ అయ్యా రు. అదేవిధంగా ఎస్టీపీపీలో పనిచేస్తున్న ఐఈడీ డీజీఎం ఎం.ప్రభాకర్‌రావును ఇల్లెందుకు బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు ఈనెల 25వ తేదీలోగా ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
ఆస్పత్రుల పరిసరాల్లో టపాసులు కాల్చొద్దు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ఆస్పత్రులు, పాఠశాలల పరిసరాల్లో టపాకాయలు పేల్చవద్దని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక ప్రకారం 2024లో టపాసులు పేల్చే విధానాలను వివరించారు. దీపావళి పర్వదినం సందర్భంగా రాత్రి 8గంటల నుంచి 10గంటల వరకే టపాకాయలు కాల్చాలన్నారు. సాధారణ ప్రమా ణాల కన్నా అధికంగా ఉన్న టపాసులను పేల్చితే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడే టపాసులు పేల్చాలని ఆయన సూచించారు.

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం