
తక్షణమే స్పందిస్తే.. ప్రాణాలు కాపాడవచ్చు
● సీపీఆర్‌పై అవగాహన అవసరం
పెద్దపల్లి: కార్డియో పల్మనరీ రెసిపిటేషన్(సీపీఆర్) విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణతో ముందుకు సాగుతోంది. పీహెచ్‌సీల పరిధిలోని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన కూడళ్లలో సదస్సులో నిర్వహిస్తోంది. గుండెపోటుకు గురైన, ఇతరత్రా ప్రమాదాల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అనుసరించాల్సిన సీపీఆర్ పద్ధతిపై అవగాహన కల్పిస్తోంది.
తొలుత అటెండర్లు, సిబ్బందికి..
జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి ఆస్పత్రుల్లో తొలుత పేషెంట్లు, అటెండర్లకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. గుండె ఆగిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపు, వైద్యసాయం అందేవరకు సీపీఆర్ ఎంతోఅవసరమని, దీనిద్వారా మెదడు ఇతర ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ అంది తాత్కాలికంగా రక్తం సరఫరా అవుతుందని, తద్వారా మెదడు దెబ్బతినదని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడేందుకు అవకాశాలు మెరుగుపడతాయని వారు అంటున్నారు.
విస్తృతంగా అవగాహన
సీపీఆర్ పద్ధతిపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు దీ నిపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించి చైతన్యవంతం కల్పిస్తున్నాం. బాధితుల ప్రా ణాలను కాపాడేందుకు మా వంతు ప్రయ త్నం చేస్తున్నాం. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్నందున సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం అధికంగా ఉంటుంది. ప్రతీపౌరుడు దీనిపై అవగాహన పెంచుకోవాలి.
– వాణిశ్రీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి