బీసీ బంద్‌ ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

బీసీ బంద్‌ ప్రశాంతం

Oct 19 2025 6:11 AM | Updated on Oct 19 2025 6:11 AM

బీసీ

బీసీ బంద్‌ ప్రశాంతం

పెద్దపల్లిలో మూతపడిన దుకాణాలు గోదావరిఖనిలో కార్మిక సంఘాల నిరసన మంథనిలో వివిధ రాజకీయ పార్టీల ఆందోళన నిర్మానుష్యంగా మారిన రహదారులు బోసిపోయి కనిపించిన ఆర్టీసీ బస్టాండ్‌లు మధ్యాహ్నం తర్వాత యథావిధిగా కార్యకలాపాలు

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌/మంథని/గోదావరిఖని:

బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ సౌకర్యం వర్తింప జేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. బీసీ కుల సంఘాల ఆందోళనలకు అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటించి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్‌లో ఆయా పార్టీలు, యూనియన్లు రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించాయి. వ్యాపార, వాణిజ్యసంస్థలు, పెట్రోల్‌ బంక్‌లు, మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు నడవలేదు. బస్టాండ్‌లు, రహదారులు వాహనాలు, ప్రజలు లేక బోసిపోయి కనిపించాయి. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. బీజేపీలోని గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయు లు కమాన్‌ ప్రాంతంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్‌ అడ్డుకున్నారు. జెండా కూడలివద్ద తెరిచి ఉన్న పాన్‌షాపును మూసివేయించేందుకు ప్రదీప్‌కుమార్‌ వర్గీయులు యత్నిస్తుండగా ఇరువర్గాల మ ధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సముదాయించారు. బీసీ సంఘాల నేత తాడూరి శ్రీమాన్‌ తదితరులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌, ఏసీపీ కృష్ణ, సీఐలు ప్రవీణ్‌ కుమార్‌, సుబ్బారెడ్డి, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశా రు. కాగా, బీజేపీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా రూ రల్‌ ఎస్సై మల్లేశం అడ్డుకున్నారు. దీంతో పోలీసులను బీజేపీ నాయకులు తోసేయగా.. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పలువురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయం సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్‌, వివిధ పార్టీల నాయకులు సతీశ్‌, రాజమల్లు, అబ్బయ్యగౌడ్‌, పడాల అజయ్‌గౌడ్‌, కందుల శ్రీనివాస్‌, కూకట్ల నాగరాజు, మిట్టపల్లి ప్రవీణ్‌, కాంపల్లి బాబు, బుర్ర శ్రీనివాస్‌, గుణపతి, సూర శ్యామ్‌, అమీరిశెట్టి తిరుపతి, టీకే ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ కపట ప్రేమ

బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్‌లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్‌, కాల్వలింగస్వామి, మాదరబోయిన రవికుమార్‌, ఎండీ ముస్తాఫా, ధూళికట్ట సతీశ్‌, తిప్పారపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ర్యాలీ

రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందు ల సంధ్యారాణి ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. నాయకులు ముస్కుల భాస్కర్‌రెడ్డి, పి డుగు కృష్ణ, జక్కుల నరహరి, గుండబోయిన భూమయ్య, కోడూరి రమేశ్‌, ఊరగొండ అపర్ణ, బోడకుంట సుభాష్‌, బండారి శ్యామ్‌, అందే రాజ్‌కుమార్‌, మహేశ్‌, మెరుగు శ్రీనివాస్‌, జక్కుల పద్మ, ప్రవీణ్‌, బియ్యాల మహేందర్‌, శివరామకృష్ణ, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లు అమలుకాకుండా కుట్ర

బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కుట్ర చేస్తున్నారని మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధు అనుమానం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు పట్టణంలో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.

బీసీ బంద్‌ ప్రశాంతం 1
1/2

బీసీ బంద్‌ ప్రశాంతం

బీసీ బంద్‌ ప్రశాంతం 2
2/2

బీసీ బంద్‌ ప్రశాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement