
‘సిమ్స్’లో సంబురాలు
● కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ
కోల్‌సిటీ(రామగుండం): నగరంలోని సింగరేణి ప్రభుత్వ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) 16 పీజీ సీట్లకు అనుమతి ఇవ్వడంపై కాలేజీలో ప్రొఫెసర్లు, మెడికోలు శనివారం సంబురాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్ తొలుత కేక్ కట్ చేసి మెడికోలకు మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కొత్త మెడికల్ కాలేజీ అయినా.. సిమ్స్‌ను ప్రోత్సహించేలా నాలుగు విభాగాల్లో 16 పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. సిమ్స్‌లో నాణ్యమైన విద్యతోపాటు చక్కటి వాతావరణం, ఆధునిక సౌకర్యాలతో విశాలమైన అకడమిక్ బ్లాక్, హాస్టళ్లు మెడికోలకు అందిస్తున్నట్లు హిమబింద్‌సింగ్ తెలిపారు. ప్రతీ మెడికో క్రమశిక్షణ, అంకితభావంతో వ్యవహరించాలని ఆమె సూచించారు. పీజీ సీట్లు మంజూరు కావడానికి కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్‌కు ప్రిన్సిపాల్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.