
పెద్దాయనా.. బాగున్నావా..
● రైతును ఆప్యాయంగా పలకరించిన మంత్రి శ్రీధర్‌బాబు
రామగిరి(మంథని): పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నియోజకవర్గానికి వచ్చిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం లద్నాపూర్ గ్రామానికి చేరుకున్నారు. అటుగా వెళ్తున్న రైతులు, వ్యవసాయ కూలీలను చూసి కారు ఆపి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆర్ అండ్ ఆర్ సమస్యను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. సింగరేణి సీఎండీ బలరాంకు ఫోన్‌చేసి మాట్లాడారు. లద్నాపూర్ గ్రామస్తుల సమస్య త్వరతిగతిన పరిష్కరించాలని సూచించారు. మంత్రి తమ సమస్యను పరిష్కరించాలని స్వయంగా ఫోన్‌చేసి ఆదేశించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్ నాయకుడు వనం రాంచందర్‌రావు ఇంట్లో మంత్రి తేనేటి విందు స్వీకరించారు. బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రోడ్డ బాపన్న, నాయకులు గంట వెంకటరమణారెడ్డి, పొన్నం సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన
పెద్దపల్లిరూరల్/రామగిరి: స్థానిక సంస్థల బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చేందుకు ఎంపిక చేసిన స్ట్రాంగ్‌రూంలను కలెక్టర్ కోయ శ్రీహర్ష అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. స్థానిక మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీలో పెద్దపల్లి సెగ్మెంట్(పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్) పరిధి, రామగిరి మండలం మంథని జేఎన్టీయూలో మంఽథని నియోజకవర్గంలోని 4 మండలాలు, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం మండలాల బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరుస్తామని కలెక్టర్ అన్నారు. మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని 7 మండలాలకు ఈనెల 23న, పెద్దపల్లి నియోజకవర్గంలోని 6మండలాలకు ఈనెల 27న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. జెడ్పీ సీఈవో నరేందర్, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కళాకారులను ప్రోత్సహించాలి
పాలకుర్తి(రామగుండం): గ్రామీణ కళాకారులను ప్రోత్సహించాలని, తద్వారా వారుఉన్నత స్థాయికి చేరుతారని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి అన్నారు. బసంత్‌నగర్‌లో ఈనెల 12వ తేదీన బిట్‌బిట్ డ్యాన్స్ అకాడమీ నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవ ప్రచార పోస్టర్‌ను తన స్వగృహంలో బుధవారం ఆవిష్కరించారు. ప్రస్తుతం ఎంతోమంది జానపద, సినీ కళాకారులు గ్రామీణ స్థాయి నుంచి వచ్చినవారేనన్నారు., అలాంటి వారు స్థానికంగా ఉంటే గుర్తించి ప్రోత్సాహం అందించాలని సూచించారు. రామగుండం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పిల్లి రాజమౌళి, మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్, ఆలయ ఫౌండేషన్ ప్రతినిధి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దాయనా.. బాగున్నావా..

పెద్దాయనా.. బాగున్నావా..