
మాంసం.. మందులేకుండా పండుగెట్లా?
దసరా పండుగ అంటేనే సుక్క.. ముక్క.. ఇవి లేకుంటే పండుగ కిక్కేముంటుంది.. అసలే సర్పంచ్ ఎన్నికలట.. తాగుడు లేదు.. కోసుడు లేదంటున్నరు.. ముందుగాల్నే తెచ్చుకుందామనుకుంటే.. వైన్స్‌ల ముందు మనోళ్ల బారులు.. నిన్నటిదాకా దసరా పండుగ జల్సాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటే.. జాతిపిత మహాత్మాగాంధీ పుట్టినరోజు అట.. జీవహింస చేయరాదట.. ఇగ దాహం ఎట్లా తీరేది? ఆకలి తీర్చుకునేది ఎట్లా? అంటున్నారు జిల్లావాసులు. మరోవైపు.. మద్యమంతా గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు తరలిపోయిందంటున్నారు. అందుకే కొందరు ‘ముందస్తు’బాబులు.. బుధవారం జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల ఎదుట బారులు తీరి ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

మాంసం.. మందులేకుండా పండుగెట్లా?

మాంసం.. మందులేకుండా పండుగెట్లా?