
నేడు మాంసం విక్రయాలు బంద్
● ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు ● రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): మహాత్యాగాంధీ జయంతి సందర్భంగా గురువారం రామగుండం నగరంలో మాంసం విక్రయాలు జరపవద్దని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా జీవహింస చేయరాదన్నారు. ఈ ఆదేశాలు అతిక్రమించే దుకాణదారుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని, చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈమేరకు మాంసం విక్రయాలు జరపకుండా దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశిస్తూ బుధవారం నోటీసులు జారీచేసినట్లు తెలిపారు.
మాంసం విక్రయాలు వద్దు
జ్యోతినగర్(రామగుండం): గాంధీ జయంతి సందర్భంగా గురువారం నగరంలో మాంసం దుకాణాలు మూసివేయాలని మున్సిపల్ కార్పొరేషన్ నాన్‌వెజ్ వెరిఫికేషన్ ప్రతినిధి శంకర్ సూచించారు. ఈమేరకు ఎన్టీపీసీలోని రాజీవ్ రహదారి సమీపంలోని మాంసం దుకాణ యజమానులకు బుధవారం నోటీసులను జారీచేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జీవహింస చేయరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. చికెన్, మటన్ విక్రయిస్తే లైసెన్స్‌ల రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.
దుర్గామాత సన్నిధిలో పూజలు
కమాన్‌పూర్(మంథని): దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బుధవారం దుర్గాదేవి మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో ఆయన పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానం
జ్యోతినగర్(రామగుండం): గోదావరిఖనిలో ఈనెల 5న నిర్వహించే అలయ్.. బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌ను ఆహ్వాన సమితి అధ్యక్షుడు బండారి రాజమల్లు కోరారు. ఈమేరకు ఎన్టీపీసీ జ్యోతిభవన్‌లో బుధవారం ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశౠరు. సిరి ఫంక్షన్ హాల్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతినిధులు క్యాతం వెంకటరమణ, సబ్బు మల్లయ్య పాల్గొన్నారు.

నేడు మాంసం విక్రయాలు బంద్

నేడు మాంసం విక్రయాలు బంద్