
సరస్వతీదేవిగా అమ్మవారు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీగణ పతి ఆలయంలో దుర్గామాత సోమవారం మ హాసరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెన్నులతో అమ్మవారిని అలంకరించి పుస్తకాలపూజ చేశారు.
వైభవంగా శోభాయాత్ర
మంథని: మంత్రపురిలో చేపట్టిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా మహాలక్ష్మీ అమ్మవారి శోభాయా త్ర పట్టణంలో వైభవంగా సాగింది. ప్రధాన కూడళ్లలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సహంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా మహిళల కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి.
కలెక్టర్‌ను కలిసిన డిప్యూటీ కలెక్టర్
పెద్దపల్లిరూరల్: గ్రూప్ –1 పరీక్ష ఫలితాల్లో ఉ త్తీర్ణత సాధించి జిల్లాకు వచ్చిన ట్రెయినీ డిప్యూ టీ కలెక్టర్ వనజ సోమవారం కలెక్టర్ కోయ శ్రీ హర్షను మర్యాద పూర్వకంగా కలిశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వనజ.. 38వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈనెల 27న సీఎం రేవంత్‌రెడ్డి నుంచి నియామక పత్రం అందుకున్నారు. శిక్షణ కోసం జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
‘భూ భారతి’తోనే పరిష్కారం
పెద్దపల్లిరూరల్: భూభారతి ప్రకారం భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి ద్వారా అందిన భూ సంబంధిత అర్జీలు, మీసేవ దరఖాస్తుల పరిష్కారం సోమవారం తన కా ర్యాలయంలో సమీక్షించారు. పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ ఉన్నారు.
ఆర్‌బీఎస్‌కే పనితీరు మెరుగుపడాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. ఆర్‌బీఎస్‌కే బృందాల పనితీరుపై పర్యవేక్షించాలని, పీహెచ్‌సీల్లో ఎన్‌సీడీ స్క్రీనింగ్ పక్కాగా నిర్వహించాలని, టీబీ అనుమానితులను గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయా లని సూచించారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
2న దసరా సెలవు
గోదావరిఖని: సింగరేణి సంస్థలో అక్టోబరు 2వ తేదీన దసరా సెలవుగా యాజమాన్యం ప్రకటించింది. ఈమేరకు సీఆర్‌పీ/పీఈఆర్/ఐఆర్/హెచ్/240/1213 పేరిట సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీజయంతి, విజయదశమి సందర్భంగా అన్నిగనులు, విభాగాలు ఆరోజు పనిచేయవని వెల్లడించింది. ఆరోజు పీహెచ్‌డీ గా నిర్ధారించి అత్యవసర విభాగం కార్మికులకే అర్హత ప్రకారం సాధారణ వేతనంతో మూడురె ట్లు అధిక వేతనం చెల్లిస్తామని వివరించింది.
నైట్‌షెల్టర్ ప్రాంతలో పారిశుధ్య పనులు
కోల్‌సిటీ(రామగుండం): స్వచ్ఛతా హీ సేవలో భాగంగా సోమవారం గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని నైట్ షెల్టర్ ఎదుట శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, ఎకో వారియర్స్ ప్రతినిధి కరుణాకర్, మెప్మా సీవో ప్రియదర్శిని, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

సరస్వతీదేవిగా అమ్మవారు

సరస్వతీదేవిగా అమ్మవారు

సరస్వతీదేవిగా అమ్మవారు