
ప్రయాణం నరకప్రాయం
పెద్దపల్లిరూరల్: కొత్తపల్లి గ్రామంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెద్దపల్లి నుంచి ఓదెల, జమ్మికుంట మీదుగా హుజూరాబాద్, వరంగల్ వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలోని రైల్వేట్రాక్ వద్ద భూగర్భ వంతె న నిర్మించారు. వర్షాలు కురిసినప్పుడల్లా నీరు పెద్దఎత్తున నిలిచి తరచూ రాకపోకలు స్తంభిస్తున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిల్వ కాకుండా రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.