
పారిశుధ్యం.. అధ్వానం
పెద్దపల్లిరూరల్: పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నా ప్రత్యేకాధికారులు పర్యవేక్షించడంలేదు. ప్రధానంగా అప్పన్నపేట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు నీటి కాలువలు పిచ్చిమొక్కలు, పూడికతో నిండిపోయాయి. బీసీకాలనీలో కాలువల నుంచి తొలగించిన చెత్తాచెదారాన్ని డంప్‌యార్డుకు తరలించడంలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు దృష్టిసారించి పల్లెల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.