
బ్యాక్‌వాటర్‌తో నష్టం
మంథనిరూరల్: కాళేశ్వరం ప్రాజె క్టు పరిధిలోని అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్ పంట పొలాలను మళ్లీ ముంచేసింది. ఆరెంద, మ ల్లారం శివారుల్లోని సుమారు 150ఎకరాల్లో పంటలు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయాయి. మూడేళ్ల క్రితం వరకు ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించింది. దీంతో రైతులు పంటలు వుయలేదు. అయితే, రెండేళ్లుగా క్రాప్ హాలీ డే ప్రకటించడం లే దు. దీంతో కొందరు రైతులు పంటలు వేశారు. ఈసారి బారీ వర్షాలు, గోదావరినది వరదతో బ్యాక్‌వాటర్ మళ్లీ పంట పొలాలను ముంచేసింది. రూ.వేలు వె చ్చించి పంటలు వేస్తే బ్యాక్ వాటర్‌లో మునిగాయని రైతులు ఆవేదన చెందారు.