
నీరు నిలిచి.. దోమలు విజృంభించి
● ఇళ్లముందు.. రోడ్లపై వర్షపునీరు ● రోజుల తరబడి నిల్వలతో ఇబ్బందులు ● అధికారుల తీరుపై స్థానికుల నిరసన
కోల్‌సిటీ(రామగుండం): తరచూ కురుస్తున్న వర్షాలతో రామగుండం నగరంలోని లోతట్టు ప్రాంతా లు జలమయమవుతున్నాయి. రోజుల తరబడి వర దనీటి నిల్వలు అలాగే ఉండిపోవడంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది స్థానికులపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా నగరవాసులు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. గోదావరిఖని అడ్డగుంటపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సమీపంలోని వివిధ కాలనీలు మరీ అధ్వానంగా తయారయ్యాయి. ఆదివారం కొద్దిగంటలపాటు కురిసిన భారీ వర్షంతో నివాసాల ఎదుటే వరదనీరు నిలిచింది. వర్షం కురిసిన ప్రతీసారి ఇలాగే వరదనీటి సమ స్య తలెత్తుతోందని, సమస్య పరిష్కరించాలని బ ల్దియా అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆవేదన చెందారు. ఈమేరకు వరద నీటి నిల్వల వద్ద నిరసన తెలిపారు. వర్షాలతో వచ్చే వరదలతో ఇళ్ల ఎదుట వరద నిలిచిపోతోందని, సమీపంలోని ఓపెన్ ప్లాట్లలో నిలిచిన నీటితోనూ దోమలు వృద్ధి చెందుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నీరు నిలిచి.. దోమలు విజృంభించి