
పరిహారం తీసుకోలేదు
జాతీయ రహదారిలో మా రెండతస్తుల ఇల్లు, భూమి, షెడ్డు కోల్పోతున్నాం. మేం ఇప్పటివరకు పరిహారం తీసుకోలేదు. మార్కెట్ ప్రకారం రూ.50లక్షల వరకు ధర పలుకుతంది. రూ.9లక్షలు ఇస్తమంటున్నరు. మా గోడును అర్థం చేసుకొని న్యాయం చేయండి. – రీసు వెంకటేశ్, పుట్టపాక, మంథని
బోరుకు పైసలు రాలె
జాతీయ రహదారి నిర్మాణంలో మాకు చెందిన 33 గుంటలు పోతంది. 23 గుంటలకే పైసలు ఇచ్చిండ్రు. మిగిలిన 10 గంటలకు మా పేరిట పట్టా లేదని పరిహారం ఇయ్యలే. మోకా మీద మేమే ఉన్నం. పత్తిచేన్ల ఉన్న బోరు, తాటి, వేప చెట్లకు డబ్బులియ్యలె. – బిరుదు రమాదేవి, రైతు
మిస్సింగ్ స్ట్రక్చర్‌కు ప్రతిపాదనలు
జాతీయ రహదారి నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు విడతల వారీగా పరిహారం చెల్లించాం. మిస్సింగ్ స్ట్రక్చర్(బోర్లు, పైపులైన్ తదితరాలు) వాటికి కూడా ప్రతిపాదనలు పంపించాం. నిబంధనల మేరకు వచ్చిన అనుమతి మేరకు పరిహారం చెల్లింపులు చేస్తున్నారు.
– కె.సురేశ్, ఆర్డీవో, మంథని