
కమిషనర్ స్పందించాలి
వర్షం వస్తే ఇండ్ల ముందు నీళ్లు నిలిచిపోతున్నయి. మా ఇండ్ల ముందు రోడ్డు వంపు గా ఉంది. నీరు నిలిచి ఇబ్బందులు వస్తున్నయి. రోడ్డు కూడా శిథిలమైంది. దోమలు బాగా వృద్ధి చెందుతున్నాయి. విషజ్వరాలు వస్తున్నయి. ఎమ్మెల్యే, కమిషనర్ స్పందించాలి.
– ఎం.తిరుపతి, స్థానికుడు
ఇళ్ల ముందే నీళ్లు
మురుగుకాలువలోకి సాఫీగా ప్రవహించాల్సిన వరద మా ఇండ్ల ముందు ఆగితే ఎలా? ఒక్కరోజు కాదు.. రెండురోజులు కాదు.. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. పిల్లలకు జ్వరాలు వస్తున్నయి. నీళ్లు నిల్వ కాకుండా చూడాలి.
– రాజమణి, స్థానికురాలు
ఎవరికి చెప్పినా స్పందన లేదు
మా ఇండ్ల ముందే వరదనీళ్లు నిలిచిపోతున్నాయని ఎవలకు చెప్పినా స్పందన లేదు. ఇంత అధ్వానంగా ఉంటుందా? రోడ్లపై నీళ్లు ఆగకుండా చర్యలు తీసుకోవాలి. సమీపంలోని ఓపెన్ ప్లాట్లలోకి వరద చేరుతోంది. దోమలతో భరించలేకున్నం. మా గోస కొంచం పట్టించుకోండి.
– ఎర్రగోల్ల రాజయ్య, స్థానికుడు

కమిషనర్ స్పందించాలి

కమిషనర్ స్పందించాలి