
పండుగకు పస్తులేనా?
రామగుండం: ఉపాధిహామీ కూలీలకు వేతనాలు అందడంలేదు. కనీసం దసరా పండుగ వరకైనా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో 2.38 లక్షల మంది కూలీలు..
జిల్లాలో 1.17 లక్షల జాబ్‌కార్డులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 2.38 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. ఇందులో యాక్టివ్‌గా ఉ న్న జాబ్‌కార్డులు 70 వేలు మాత్రమే. ప్రతీరోజు ఉపాధి పనులకు హాజరయ్యేవారు 1.11లక్షల మంది ఉన్నారు. కూలీలకు మే నెల నుంచి, 230 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు జూలై నుంచి, 27 మంది టెక్నికల్ అసిస్టెంట్లకు ఆగస్టు నుంచి, 10 మంది ఏపీవోలకు ఆగస్టు నెల నుంచి వేతనాలు అందడంలేదు.