
దీపావళి బోనస్ ఖరారు
● రూ.లక్షకుపైగా ‘పీఎల్‌ఆర్’ ● ఈసారి రూ.1.03లక్షల చెల్లింపు ● గతేడాదికన్నా రూ.9,250 పెరుగుదల ● ఒప్పందంపై కార్మిక సంఘాల సంతకం
గోదావరిఖని: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 2.40 లక్షల మంది బొగ్గు గని కార్మికుల పెర్ఫార్మెన్స్ లింక్‌డ్ రివార్డ్(పీఎల్‌ఆర్– దీపావళి) బోనస్ గురువారం అర్ధరాత్రి ఖరారైంది. జాతీయ కార్మిక సంఘాలు, కోలిండియా యాజమాన్యంతో ఈనెల 25న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ సమావేశమయ్యారు. బొగ్గుగని కార్మికులకు చెల్లించే బోనస్‌పై ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ మధ్య చర్చలు సాగించా రు. ఒక్కో కార్మికునికి దీపావళి బోనస్(పీఎల్‌ఆర్) రూ.1.30లక్షలు చెల్లించాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. యాజమాన్యం స్పందిస్తూ.. రూ.98వేలు చెల్లించేందుకు ముందుకు వ చ్చింది. ఇందుకు ససమేమిరా అన్న కార్మిక సంఘా లు.. ఒకానొక దశలో సమావేశం నుంచి లేచి హాల్ బయటకు వచ్చేశాయి. చర్చలు శుక్రవారం నాటికి వాయిదా వేయాలని కార్మిక సంఘాల నాయకులు విన్నవించారు. అయినా, రాత్రి భోజనం చేసిన త ర్వాత కార్మిక సంఘాలు, కోల్ ఇండియా యాజమా న్యం మళ్లీ సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకూ సాగిన చర్చల్లో కార్మిక సంఘాలు రూ.1.05 లక్షలు చెల్లించాలని పట్టుబట్టాయి. కానీ యాజమాన్యం రూ.1.03 లక్షలు చెల్లించేందుకే అంగీకరించింది. దీంతో కార్మిక సంఘాలు, కోలిండియా యాజమా న్యం ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్(ఫా) గౌతం పొట్రూ హాజరుకాగా, కార్మిక సంఘాల నాయకులు.. ఐఎన్‌టీయూసీ నుంచి జనక్‌ప్రసాద్, హెచ్‌ఎంఎస్ నుంచి రియాజ్‌అహ్మద్ చర్చల్లో పాల్గొన్నారు.
గతేడాదికన్నా రూ.9,250పెంపు
బొగ్గు గని కార్మికులకు గతేడాది రూ.93,750 పీఎల్‌ఆర్ బోనస్ చెల్లించారు. ఈసారి ఈ బోనస్ రూ.9,250 పెంచి రూ.1.03లక్షలు చెల్లించేందుకు కోలిండియా యాజమాన్యం అంగీకరించింది. గతేడాది రూ.8,750 పెంచగా, ఈసారి మరో రూ.500 ఎక్కువ చేసి రూ.9,250పెంచారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ ఉత్కంఠభరితంగా చర్చలు సాగాయి. పెరిగిన దీపావళి బోనస్ సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న సుమారు 41వేల మందికి వర్తించనుంది.
ఏడాది పెంపు చెల్లింపు
2020 3,800 68,500
2021 4,000 72,500
2022 4,000 76,500
2023 8,500 85,000
2024 8,750 93,750
2025 9,250 1,03,000