
వీధి వ్యాపారులకు స్కానర్లు
కోల్‌సిటీ(రామగుండం): నగరంలోని వీధివ్యాపారులకు డిజిటల్ లావాదేవీల కోసం పోస్టా ఫీస్ జారీచేసిన క్యూఆర్ కోడ్ స్కానర్లను కమిషనర్ అరుణశ్రీ అందజేశారు. శుక్రవారం బల్ది యా కార్యాలయంలో లోక కల్యాణ్ మేళాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడారు. పథకాల ప్రయోజనాలు పొందడంలో పోస్టాఫీస్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పోస్టాఫీసు లావాదేవీలతో క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా పొందవచ్చని వెల్లడించారు. పోస్టల్ మేనేజర్ రాజేశ్ మాట్లాడుతూ, పోస్టాఫీస్ ఖాతాతో దేశంలోని ఏ పోస్టాఫీస్‌కు వెళ్లయినా, వేలి ముద్ర ఆదారంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక, సీవోలు శ్వేత, ఊర్మిళ, శమంత, ప్రియదర్శిని, పోస్టల్ అధికారి భావన, వీధి వ్యాపారులు పాల్గొన్నారు.
చెరువులకు జలకళ
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కొద్దిరోజులు గా వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని పెద్దచెరువు వర్షపునీటితోపాటు ఎగువ నుంచి వస్తు న్న వరదతో నిండుకుండలా మారింది. వచ్చే యాసంగి పంటలకు అవసరమైన నీటికి ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏషియన్ ఆర్చరీ టోర్నీకి చికిత
ఎలిగేడు(పెద్దపల్లి): బంగ్లాదేశ్ వేదిక గా జరిగే ఏ షియన్ ఆర్చ రీ చాంపియన్‌షిప్ టోర్నీకి సుల్తానాపూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత ఎంపికై ంది. గురువారం సోనీపెట్(హరియాణా) వేదికగా జరిగిన ట్ర యల్స్‌లో చికిత సత్తా చాటింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న చికిత మరో మారు దేశ ఖ్యాతిని ఇనుమాడింపజేసేందుకు పట్టుదలతో ఉందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. చికితను పలువురు ప్రతినిధులు శుక్రవారం అభినందించారు.
ఆర్టీసీ ప్రయాణికులకు నగదు నజరానా
గోదావరిఖనిటౌన్: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీ డ్రా స్కీం ప్రవేశపెట్టినట్లు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈనెల 27 నుంచి అక్టోబ ర్ 6వ తేదీ వరకు సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రోడీలక్స్, సూపర్‌లగ్జరీ, లహరి నాన్ ఏసీ, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి ఈ స్కీం వర్తిస్తుందన్నారు. ప్రయాణికులు టికెట్ల వెనకా ల పేరు, చిరునామా, మొబైల్ నంబర్ రాసి బ స్సుల్లో ఏర్పాటు చేసిన బాక్స్‌ల్లో వేయాలని సూచించారు. అక్టోబర్ 8న సాయంత్రం 4గంటలకు కరీంనగర్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో డ్రా తీస్తామని పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండోబహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేల నగదు అందిస్తామని డీఎం పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ యాత్రాదానం పథకం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. వివరాలకు 73828 47596, 70135 04982 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సాగు వివరాలు నమోదు చేయాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రతీరైతు తన భూమిలో సాగుచేసే పంట వివరాలను వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద నమోదు తప్పకుండా చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ సూచించారు. రైతు తమ క్లస్టర్ పరిధిలోని ఏఈవో వద్ద వానాకాలం సీజన్‌లో సా గు చేస్తున్న పంట వివరాలను పొరపాటు లేకుండా నమోదు చేసుకోవాలని అన్నారు. దిగుబడులను విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ సమాచారం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తొలిరోజు 6 దరఖాస్తులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా రు. తొలిరోజు 6 దరఖాస్తులు అందాయని ఎక్సై జ్ సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. పెద్దపల్లిలో 3, సుల్తానాబాద్, రామగుండం, మంథనిలో ఒక్కో దరఖాస్తు అందినట్లు వివరించారు.

వీధి వ్యాపారులకు స్కానర్లు

వీధి వ్యాపారులకు స్కానర్లు